Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేశాడు.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (12:36 IST)
క్రికెట్‌లో బంతి షైన్ అవ్వాలంటేనే క్రికెటర్లు దానిపై ఉమ్మి రాయడం చాలాకాలంగా చేస్తున్నారు క్రికెటర్లు. కానీ కరోనా నిబంధనల కారణంగా ఆ పనిచేయడానికి ఇప్పుడు లేదు. కొద్దిరోజుల కిందట రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అదే పొరపాటును చేసి విమర్శలు అందుకున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. వెంటనే తన తప్పు తెలుసుకోవడం విశేషం.
 
ఢిల్లీ కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో మూడో ఓవర్ జరుగుతున్న వేళ, ఓపెనర్ పృథ్వీ షా ఆడిన షాట్‌ను షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు. ఆపై తన నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి పూశాడు. ఆ వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని, పొరపాటై పోయిందన్నట్టు సంజ్ఞ చేశాడు. ఈ ఘటనపై సరదా కామెంట్లు వస్తున్నాయి.
 
కరోనా ముప్పు దృష్ట్యా సలైవా వాడకాన్ని ఐసీసీ జూన్‌లో తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించాలని, అయినా రిపీట్ చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. "గెలిచే కసిలో అంతే... అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి" అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments